హైదరాబాద్: ఇన్నాళ్లు విదేశాల నుంచి వచ్చిన వాళ్లకే ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) సోకిన నేపథ్యంలో తాజాగా తెలంగాణలో తొలి ప్రైమరీ కాంటాక్ట్ కరోనా కేసు నమోదైంది. తొలిసారి స్థానికుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ తేలినట్లు వైద్యాధికారులు గుర్తించారు. P14 కేసు ద్వారా సదరు వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు చెబుతున్నారు. కూకట్‌పల్లిలో ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణలో ఇప్పటి వరకు 19 మంది కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. వారిలో 16 మందికి గాంధీ ఆస్పత్రిల్లో చికిత్స అందిస్తుండగా.. మరో ఇద్దరిని చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. మరొకరికి నయం కావడంతో డిశ్చార్జి చేసినట్లు సమాచారం.(జనతా కర్ఫ్యూ: తెలంగాణలో 24 గంటల బంద్!)
తెలంగాణలో తొలి కేసు.. స్థానికుల్లో కరోనా!