‘ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేది తల్లి మాత్రమే. కానీ నాకోసం ఉద్యోగాన్నే వదిలేసి అతను కూడా త్యాగం చేయగలనని నిరూపించాడు. అంతేకాక నాకు ఎంతో ఇష్టమైన ఈ రంగంలో నాకు అండగా నిలబడి ప్రేమను చాటుకున్నాడు’ ఈ మాటలు అంటోంది ఎవరో కాదు హీరోయిన్ అమలాపాల్. గత కొంతకాలంగా అమల ఎవరితోనో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన కేరళ బ్యూటీ ఇది నిజమేనని అంగీకరించినప్పటికీ, అతని పేరు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు. అంతేకాక ప్రియుడి వివరాలను, వారి షికార్లను కూడా గుట్టుగా దాస్తూ వచ్చింది. ఇకపోతే అమల బాయ్‌ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందోచ్ అని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ మేరకు కొన్ని ఫొటోలు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో బుర్కా ధరించి ఉన్న అమల వెంట ముంబై సింగర్ భవ్నీందర్ సింగ్ ఉన్నాడు. (ఆ ఇద్దరు విడిపోవడానికి అతనే కారణం)
అతడే అమలాపాల్ ప్రియుడు!